Wednesday, 2 August 2017

thumbnail

ఈరోజు రేపు ఎంత మంది ఆఖరి వయసులో తల్లి తండ్రుల్ని బాగా చూసుకుంటున్నారు

ఈ రోజు రేపు టీవీ షోస్ చాలా వస్తున్నాయి వాటిల్లో అన్ని చాలా వరకు ఒక సక్సెస్ అయినా వాటిని అనుసరించి కాపీ చేయడమేగాని ఏ ఒక్క ప్రోగ్రాం కూడా కొత్తగా మన వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు ఎందుకు తెలివితేటలూ లేక లేకపోతే సక్సెస్ అయినా ప్రోగ్రాం లు అయితే త్వరగా గుర్తింపు వస్తుంది అనా అర్ధం కావడంలేదు. 
ఒక జబర్దస్త్ సక్సెస్ అయ్యింది మరి అలాంటివే మల్లి మల్లి ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు కొత్తవి దొరకడం లేదా లేకపోతే ఆలోచించలేకపోతున్నారా చేస్తే రిస్క్ ఎందుకు అనుకుంటున్నారా కొత్తవి చేస్తే నిలబెట్టడానికి చాలా టైం పడుతుంది అని భయపడుతున్నారా? 

ఒక ప్రోగ్రాం చేస్తే అది సోసిటీ కి కూడా ఎంతో కొంత ఉపయోగం ఉండాలి ఎంతో కొంత మంచి చెప్పాలి మన సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించేలా వాటి విలువల్ని కాపాడేలా ఉండాలి అలాంటి షోస్ ఎందుకు చేయలేరు. 
ఒక్కసారి ఆలోచించండి. 
మన ఇండియా లో తల్లి తండ్రి గురువు దైవం అంటారు. అలాంటి ముందు వరసలో ఉన్న తల్లి తండ్రుల్ని ఈరోజు రేపు ఎంత మంది ఆఖరి వయసులో బాగా చూసుకుంటున్నారు గౌరవిస్తున్నారు ప్రేమగా పలకరిస్తున్నారు? ఎంత మంది వాళ్ళని తమతో పాటె ఉంచుకుని మంచి చెడు  చూస్తున్నారు? అసలు అలా చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది?
అలా చూసుకునే వాళ్ళు లేరా? ఉన్నారు మరి అలాంటి వాళ్ళని పిలిచి షోస్ చేయండి. 
వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రుల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు ఎంత టైం కేటాయిస్తున్నారు వాళ్ళ బిజీ షెడ్యూల్ ని ఎలా ప్లాన్ చేసుకుని తల్లి తండ్రులకు సమయం కేటాయిస్తున్నారు అంత ప్రేమగా వాళ్ళని ఎలా చూసుకోగలుగుతున్నారు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు అంటే వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి. 
అసలు అంత ప్రేమ ఆప్యాయతలు ఉండటానికి తల్లి తండ్రులు ఎలా పెంచారు ఎంత బాగా పెంచాతారు ఇవన్నీ చూపించండి ! 
ఒక షో హిట్ కావాలంటే కొంచెం కల్పనా కొంచెం డ్రామా కొంచెం హైప్ చేసే వి చాలా చేయాలి అవి ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ కోసం చేయండి అలా ప్రేమగా చూసుకునే వారిని గొప్పగా ట్రీట్ చేయండి సత్కరించండి పెద్ద పెద్ద వాళ్ళతో విషెస్ చెప్పించండి ఐ మీన్ సెలెబ్రేటిస్ తో ఇంత ప్రేమగా చుసుకునే వీళ్ళని ఎంకరేజ్ చేయండి ఎంతలా అంటే తల్లి తండ్రుల్ని వదిలేసి వాళ్ళని అనాధ ఆశ్రమాల్లో ఉంచే వాళ్ళు సిగ్గు పడేలా వాళ్ళు కూడా ఆలోచించేలా వాళ్లకి కూడా అరె  మన తల్లి తండ్రులని బాగా చూసుకోవాలి అనిపించేలా మనం ప్రోగ్రాం ని చేయొచ్చు ప్లీజ్ ఇలాంటి చేయని కనీసం ట్రై  చేయండి

About

Search This Blog

Powered by Blogger.

Pages